Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chalaki Chanti – Jabardasth : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించిన చంటి ఆ తర్వాత జబర్దస్త్ లో స్కిట్స్ తో చలాకి చంటిగా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తో పాటు పలు షోలు, సినిమాలతో బిజీగా ఉండే చంటి గత సంవత్సరం హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరాడు. దీంతో సంవత్సర కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న చంటి ఇప్పుడు బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మళ్ళీ జబర్దస్త్ చేస్తారా అని ఇంటర్వ్యూలో అడగ్గా చంటి మాట్లాడుతూ.. నేను మళ్ళీ జబర్దస్త్ చేయను. నన్ను వాళ్ళే వద్దన్నారు. ఎందుకు వద్దన్నారో నాకు కూడా తెలీదు. వాళ్ళు వద్దన్నా ఇంక నేను మళ్ళీ అడగను. అందరూ అది ఈగో అనుకుంటారు. కానీ దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అంటారు. అందరికి ఈగో ఉంటుంది. వాళ్ళు వద్దన్నాక నేను అడిగితే కరెక్ట్ కాదు. అందుకే మళ్ళీ జబర్దస్త్ చేయను అని తెలిపాడు. అయితే జబర్దస్త్ వాళ్ళు చలాకి చంటిని ఎందుకు వద్దు అని చెప్పారో కారణం మాత్రం తెలపలేదు. దీంతో చంటి ఇకపై జబర్దస్త్ లో కనపడదు అని క్లారిటీ వచ్చింది. మరి సినిమా అవకాశాలు అయిన వస్తాయేమో చూడాలి.
Admin
Studio18 News