Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నటుడు వరుణ్ తేజ్ వివాహ బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మట్కా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న వరుణ్ తేజ్.. పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం అన్నారు. భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే అతని జీవితం నరకమే అని పేర్కొన్నారు. మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని, విజయాన్ని పంచుకోవడానికి జీవితంలో మనకంటూ ఒక భాగస్వామి ఉండాలని తాను తెలుసుకున్నానని చెప్పారు. ఒక బంధం బలంగా ఉండాలంటే సరైన వ్యక్తిని ఎంచుకోవడంలో ఉంటుందన్నారు. అలా కాని పక్షంలో అది నరకమే అవుతుందని అన్నారు. దాదాపు ఏడేళ్లు (లావణ్య త్రిపాఠి) రిలేషన్‌లో ఉండి ఒకరికొకరం సరిపోతామని తెలుసుకున్నామని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని వరుణ్ తేజ్ తెలిపారు. వ్యక్తిగత జీవితం చక్కగా ఉంటే మన కలలు సాకరం చేసుకోవడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చని ఆయన అన్నారు. కాగా, గతేడాది నటి లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read : ‘నీట్’ విద్యార్థినిపై టీచర్ల అత్యాచారం
Admin
Studio18 News