Saturday, 17 January 2026 09:19:57 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

తన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడం పట్ల రాజేంద్రప్రసాద్ వివరణ

Date : 02 June 2025 04:16 PM Views : 212

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కమెడియన్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కొన్ని రోజుల కిందట కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి చర్చనీయాంశంగా మారారు. తన వ్యాఖ్యలను తప్పుబడుతుండడం పట్ల రాజేంద్రప్రసాద్ తాజాగా వివరణ ఇచ్చారు. ఇవాళ 'షష్టిపూర్తి' చిత్ర యూనిట్ విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్, తాను ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తినని స్పష్టం చేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజైన జూన్ 2న ఈ సక్సెస్ మీట్ జరగడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్ అన్నారు. "ఆయనకు నేనంటే ఎంతో అభిమానం, ప్రేమ. ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో నేను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ. నేనైతే ఇలానే ఎప్పుడూ సరదాగానే ఉంటాను. మీడియాను నా కుటుంబంగా భావిస్తాను. నన్ను మీరంతా అన్నయ్య అని పిలవడం నా అదృష్టం" అని ఆయన తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తాను పరిచయం చేసిన హీరోయిన్, నటుడి గురించి సరదాగా మాట్లాడిన మాటలను కూడా తప్పుగా చిత్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. పెళ్లి (పెళ్లిపుస్తకం) నుంచి షష్టిపూర్తి వరకూ కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగడం ఇండస్ట్రీలో ఏ నటుడికి దక్కని అరుదైన అవకాశం. మీ అందరూ ఈ సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు" అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. నటన గురించి మాట్లాడుతూ, "మనం నటించే సినిమాల్లో మనం కనిపించకూడదు, పాత్రలే కనిపించాలి. నాతో పనిచేసిన నటీనటులంతా నాతో సరదాగానే ఉంటారు. అందులో తప్పేం లేదు" అని ఆయన వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :