Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jani Master : జానీ మాస్టర్ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణలతో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై పలువురు స్పందించారు. జానీ మాస్టర్ కి సపోర్ట్ గా కూడా అవన్నీ ఆరోపణలు అంటూ అతని భార్య, పలువురు మాట్లాడుతున్నారు. జనసేనలో చాలా యాక్టివ్ గా ఉండే జానీ మాస్టర్ ని ప్రస్తుతం పార్టీ దూరంగా పెట్టింది. అయితే ఇటీవల జానీ మాస్టర్ తల్లి తన కొడుకుపై వస్తున్న ఆరోపణలు చూసి ఆవేదనతో గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు లోని ఓ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా నెల్లూరుకు చెందిన జనసేన నేత కిషోర్ గుణుకుల జానీ మాస్టర్ తల్లిని పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కిషోర్ గుణుకుల హాస్పిటల్ బయట మీడియాతో మాట్లాడుతూ.. జానీ మాస్టర్ తల్లికి ఇలా జరిగింది అని పరామర్శించడానికి వచ్చాను. ఆయన్ని ఎప్పట్నుంచో చూస్తున్నాను, ఒక మంచి వ్యక్తి. మా అందరితో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి. ఇది ప్లాన్ చేసిన ట్రాప్ అనిపిస్తుంది. జానీ మాస్టర్ ఒక పేద కుటుంబం నుంచి ఎదిగి పై స్థాయికి వచ్చారు. మా అందరికి ఆయన ఆదర్శప్రాయం. సాటి మహిళలతో, చుట్టు పక్కన ఉన్న వాళ్ళతో మర్యాదగా మంచిగా ప్రవర్తించేవాడు. ఎప్పుడూ కూడా పక్క వాళ్లకు అపాయం చేయలేదు. ఆయన్ని నేను దగ్గర్నుంచి చూసాను. ఒక సంవత్సరం రోజులుగా కేసు పెట్టిన అమ్మాయి పలుమార్లు మాకు కూడా మెసేజ్ పెట్టింది. ఇది చూస్తుంటే ప్లాన్ చేసి ట్రాప్ చేశారనిపిస్తుంది. ఇది పార్టీలకతీతంగా చెప్తున్నాను. జానీ మాస్టర్ తో కానీ, అతని కుటుంబ సభ్యులతో కానీ నాకు మంచి సంబంధాలు ఉన్నాయి . జానీ మాస్టర్ తల్లి త్వరగా కోలుకోవాలి. దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. అటు పక్కనే ఆడపిల్ల కాదు ఇటు పక్క జానీ మాస్టర్ తల్లి, జానీ మాస్టర్ భార్య.. ఇటు పక్కన కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని సంవత్సర కాలంగా చూస్తున్నాను. పలుమార్లు ఇబ్బంది పెట్టాలని చూసింది. దీని వెనక ఎవరు ఉన్నా అది కరెక్ట్ కాదు. కష్టపడి పైకి ఎదిగిన జానీ మాస్టర్ ని ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాను. జానీ మాస్టర్ తల్లి ఈ విషయంలో ఆవేదన చెంది గుండెపోటుకు గురైంది. జానీ మాస్టర్ కి, ఆమె కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలి అంటూ మాట్లాడారు. ఈ వీడియో తన సోషల్ షేర్ చేసి.. జానీ మాస్టర్ గురించి రాసుకొచ్చారు కిషోర్. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Admin
Studio18 News