Monday, 08 December 2025 04:41:53 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Paresh Rawal: అవార్డుల్లో భారీ లాబీయింగ్ ఉంటుంది.. ఆస్కార్ కూడా మినహాయింపు కాదు: పరేశ్ రావల్

Date : 03 November 2025 06:22 PM Views : 97

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినీ అవార్డులపై పరేశ్ రావల్ కీలక వ్యాఖ్యలు జాతీయ అవార్డుల విషయంలో లాబీయింగ్ ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్య ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ పైరవీలకు ఆస్కారం ఉందని వెల్లడి జ్యూరీ సభ్యులను ఆకర్షించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తారన్న పరేశ్ అవార్డుల కంటే దర్శకనిర్మాతల ప్రశంసలే తనకు విలువైనవని వ్యాఖ్య ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ సినీ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు అన్నింట్లోనూ లాబీయింగ్ జరుగుతుందని, దీనికి ఏ పురస్కారాలూ మినహాయింపు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నటీనటులకు అవార్డులు, ట్రోఫీల కన్నా దర్శకనిర్మాతల నుంచి వచ్చే ప్రశంసలే అత్యంత విలువైనవని స్పష్టం చేశారు. ఓ సందర్భంలో మాట్లాడుతూ, అవార్డుల ఎంపిక ప్రక్రియపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. "నాకు అవార్డుల గురించి పెద్దగా తెలియదు. కానీ జాతీయ అవార్డులతో సహా అన్ని పురస్కారాల్లో లాబీయింగ్‌కు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా జాతీయ అవార్డుల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఆస్కార్ అవార్డుల్లోనూ పైరవీలు జరుగుతాయి" అని ఆయన వివరించారు. అవార్డుల కోసం చిత్రబృందాలు తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటాయని, కొన్ని పార్టీల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తాయని పరేశ్ రావల్ తెలిపారు. "కొంతమంది నిర్మాతలు జ్యూరీ సభ్యులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి, ‘ఇది ఫలానా పెద్ద దర్శకుడి సినిమా’ అనే కారణంతో కూడా అవార్డుల కమిటీ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది" అని ఆయన పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా అవార్డుల కంటే నటనకు లభించే గుర్తింపే ముఖ్యమని పరేశ్ రావల్ అన్నారు. "నా నటన బాగుందని దర్శకనిర్మాతలు ప్రశంసిస్తే కలిగే ఆనందం ముందు అవార్డులు దిగదుడుపే. ఆ ప్రశంసలే నాకు అత్యంత విలువైనవి" అని ఆయన స్పష్టం చేశారు. కాగా, 1994లో ‘వో ఛోకరీ’, ‘సర్’ చిత్రాల్లోని నటనకు గాను పరేశ్ రావల్ జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్న విషయం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :