Sunday, 08 March 2026 09:47:52 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Balakrishna : 50 ఏళ్ళ నట జీవితానికి.. బాలయ్యకు అరుదైన అవార్డు.. కరణ్ జోహార్ చేతుల మీదుగా..

Date : 28 September 2024 10:40 AM Views : 345

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ళ నటన జీవితం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే టాలీవుడ్ భారీ ఈవెంట్ నిర్వహించింది. 50 ఏళ్లుగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన బాలకృష్ణ ఎన్నో అవార్డులు అందుకోగా తాజాగా తన 50 ఏళ్ళ నట ప్రస్థానానికి గాను స్పెషల్ అవార్డు అందుకున్నారు. తాజాగా IIFA వేడుకలు UAE లోని అబుదాబిలో ఘనంగా జరగ్గా టాలీవుడ్ సినీ ప్రముఖులు అనేకమంది ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఐఫా తరపున బాలకృష్ణకు ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు అందచేశారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందచేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా 50 ఏళ్ళ నట ప్రస్థానానికి ఐఫా నాకు గోల్డెన్ లెగసి అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉంది. నాటి తోటి స్టార్స్ తో మంచి స్పోర్టివ్ కాంపిటేషన్ ఉంటుంది. నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను అని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :