Monday, 19 January 2026 06:44:08 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Ramcharan-Rajamouli : ఇక సహించేది లేదు.. మంత్రి కొండా సురేఖకి రాజమౌళి, రామ్ చరణ్ కౌంటర్..!

Date : 04 October 2024 10:19 AM Views : 227

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ramcharan-Rajamouli : అక్కినేని ఫ్యామిలీ, సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సినీనటులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, సమంత, అమల, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రెటీలు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. దర్శకుడు జక్కన్న ట్విట్టర్ వేదకగా ‘‘హుందాతనాన్ని నిలబెట్టుకోండి. గౌరవప్రదంగా వ్యవహరించండి. ప్రభుత్వ ప్రతినిధులుగా ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి’’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు.. #FilmIndustryWillNotTolerate (ఫిల్మ్‌ ఇండస్ట్రీ సహించదు) అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా యాడ్ చేశారు. రామ్‌ చరణ్‌ కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆమె వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమైనవిగా పేర్కొన్నారు. ఒక రాజకీయ నేత ఇలా అసభ్యకరంగా మాట్లాడడం దిగ్భ్రాంతికరం. ఆమె ఆరోపణలు నిరాధారమైనవి. సామాజిక విలువలను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ సహించదు’’ అని పోస్టు పెట్టారు. రాజకీయ లబ్ధికి సెలబ్రెటీలను లక్ష్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టాలీవుడ్‌ నిర్మాతలు, హీరోలు, దర్శకులు సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీ కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేశారని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :