Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. బాలకృష్ణ జన్మదినోత్సవం (జూన్ 10) సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రత్యేక కానుకను అభిమానులకు అందించింది. ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టీజర్‌లో బాలకృష్ణ తనదైన శైలిలో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టారని, ఆయన లుక్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోందని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసిందని, గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. బాలకృష్ణ చెప్పిన సంభాషణలు, టీజర్‌లోని విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. గతంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘అఖండ’ చిత్రం సంచలన విజయం సాధించి, బాలకృష్ణ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే విజయవంతమైన కాంబినేషన్‌లో ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కుతుండటంతో సినిమాపై
Admin
Studio18 News