Thursday, 12 March 2026 12:23:54 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Pragathi: వేణు స్వామికి నటి ప్రగతి కౌంటర్

Date : 24 December 2025 07:24 PM Views : 182

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మెడల్స్ సాధించిన ప్రగతి ప్రగతి విజయం వెనుక తన పూజలు ఉన్నాయన్న వేణుస్వామి కఠిన సాధన, నిరంతర కృషి వల్లే తాను గెలిచానన్న ప్రగతి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి... క్రీడారంగంలో కూడా సత్తా చాటుతున్నారు. తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో తానేంటో నిరూపించుకున్నారు. ఈ పోటీల్లో ఆమె ఒక బంగారు, మూడు రజత పతకాలు గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు. నటనలోనే కాకుండా, క్రీడల్లోనూ తన ప్రతిభను చాటుతూ... ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు. ఈ ఘన విజయం తర్వాత, ప్రగతి చుట్టూ ఓ వివాదం చోటుచేసుకుంది. ప్రగతి సాధించిన మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, వ్యాఖ్యలకు ప్రగతి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పూజల వల్లే తాను విజయం సాధించానని వేణుస్వామి చెప్పడం సరికాదని ప్రగతి అన్నారు. కఠిన సాధన, నిరంతర కృషి వల్లే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని చెప్పారు. వేణుస్వామి వద్ద రెండున్నరేళ్ల క్రితం తాను పూజలు చేయించుకున్న విషయం నిజమేనని... అయితే, తాను మానసికంగా కష్టమైన దశలో ఉన్నప్పుడు ఆ పూజలు చేయించుకున్నానని తెలిపారు. తన స్నేహితుల సూచనతోనే తాను ఆయన వద్దకు వెళ్లానని... టైమ్ బాగోలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం సహజమేనని చెప్పారు. వేణుస్వామి పూజల వల్ల సినీ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ తనకు ఎలాంటి ప్రగతి కనిపించలేదని ప్రగతి స్పష్టం చేశారు. ఎప్పుడో జరిగిన పూజలకు, ఇప్పుడు తాను సాధించిన విజయానికి ముడిపెడుతూ... తన విజయానికి ఆ పూజలే కారణమన్నట్టుగా చెప్పుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. తన విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :