Wednesday, 17 December 2025 03:53:15 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Sachana Namidass : తమిళ్ బిగ్ బాస్ లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? మహారాజాలో విజయ్ సేతుపతి కూతురు..

Date : 08 October 2024 11:07 AM Views : 214

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sachana Namidass : తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అయిదు వారాలు అయిపోయి ఆరోవారం సాగుతుంది. ఇక తమిళ్ లో ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. అక్టోబర్ 6 ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 మొదలయింది. ఈసారి కమల్ హాసన్ షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. దీంతో తమిళ్ ఆడియన్స్ కి బిగ్ బాస్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి మన తెలుగు వాళ్లకు తెలిసిన వాళ్ళు ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ కు తెలుగు వాళ్ళతో అంత పరిచయం లేదు. మొత్తం ఈసారి తమిళ్ బిగ్ బాస్ లో.. నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్, సచన నమిదాస్, దర్శ గుప్తా, సత్య, దీపక్, RJ అనంతి, సునీత గొగోయ్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, అరుణ్ ప్రశాంత్, తర్షిక, VJ విశాల్, అన్శిదా, అర్ణవ్, ముత్తుకుమారన్, జాక్వెలిన్.. లు పాల్గొంటున్నారు. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అయితే వీరిలో లావుగా ఉండే నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్ ఓ సీరియల్ నటిని పెళ్లి చేసుకొని బాగా వైరల్ అయ్యాడు. ఆ తర్వాత పలు వివాదాల్లో కూడా నిలిచాడు. ఇక సచన నమిదాస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో మెప్పించగా ఇటీవల విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజాలో విజయ్ సేతుపతి కూతురిగా నటించి మెప్పించింది. పలు సినిమాల్లో నటిస్తూనే టీవీ షోలలో అలరిస్తున్న సచన నామిదాస్ ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా సచన నామిదాస్ ని ఎలిమినేట్ చేసేసినట్టు చూపించారు. మరి ఎలిమినేట్ చేసారా, సీక్రెట్ రూమ్ లో దాచారా తెలియాలంటే తమిళ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడాల్సిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :