Saturday, 17 January 2026 09:53:45 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

ప్రముఖ సినీ నటుడు రాజేశ్ కన్నుమూత

Date : 29 May 2025 04:41 PM Views : 310

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దక్షిణాది సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు రాజేశ్ (75) కన్నుమూశారు. చెన్నై రామాపురంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 150కి పైగా చిత్రాల్లో నటించి, తనదైన శైలితో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న రాజేశ్ మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, మన్నార్‌గుడిలో 1949 డిసెంబర్ 20న రాజేశ్ జన్మించారు. తొలుత ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన, నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు కుమార్తె దివ్య, కుమారుడు దీపక్ ఉన్నారు. ఆయన భార్య జోన్ సిల్వియా గతంలోనే మరణించారు. ప్రజల సందర్శనార్థం రాజేశ్ భౌతికకాయాన్ని రామాపురంలోని ఆయన నివాసంలో ఉంచారు. ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో 1974లో వచ్చిన 'అవళ్ ఒరు తొడర్‌కతై' చిత్రంతో రాజేశ్ నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తరువాత, రాజ్‌కన్ను నిర్మించిన 'కన్ని పరువత్తిలే' (1979) చిత్రంలో కథానాయకుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. దాదాపు ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో తమిళం, తెలుగు, మలయాళం తదితర దక్షిణాది భాషా చిత్రాల్లో అనేక రకాల పాత్రలు పోషించారు. కథానాయకుడిగా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోయి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన భావయుక్తమైన నటన, తెరపై గంభీరమైన ఉనికి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నటనలోనే కాకుండా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా రాజేశ్ తన ప్రతిభను చాటుకున్నారు. తన గంభీరమైన, ప్రత్యేకమైన స్వరంతో అనేక పాత్రలకు జీవం పోశారు. దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :