Saturday, 24 January 2026 03:01:05 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Indraja: సక్సెస్ లేకపోతే ఎవరైనా 'జీరో'నే: నటి ఇంద్రజ

Date : 08 December 2025 07:50 PM Views : 166

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 90లలో వెండితెరపై వెలిగిన ఇంద్రజ ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ ఆర్ధిక ఇబ్బందులతో పెరిగానని వెల్లడి డబ్బే ప్రధానంగా మారిపోయిందని వ్యాఖ్య 1990లలో కథానాయికగా వెండితెరపై సందడి చేసిన అందాల తార ఇంద్రజ. హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నడుస్తున్న సమయంలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నారు. తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నాకు ఊహ తెలిసే సమయానికే మా అమ్మ హార్టు పేషంట్. ఒకసారి అమ్మకి అత్యవసరంగా సర్జరీ చేయించవలసి వచ్చింది. నా కంటే చిన్నవాళ్లయిన చెల్లెళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటికి నేను ఒక సినిమాలో చేస్తున్నాను. వాళ్లకి పరిస్థితి చెప్పినా, నాకు ఇవ్వవలసిన డబ్బు కూడా ఇవ్వలేదు. చివరికి మా పరిస్థితికి జాలిపడి ఇద్దరు డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. ఆ తరువాత నిదానంగా డబ్బు సర్దుబాటు చేశాము. అందువలన నన్ను ఎవరైనా సాయం అడిగితే కాదనలేను" అని అన్నారు. "ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటూ సాయం చేస్తున్నామో .. వాళ్ల నుంచే మనం ఎదురుదెబ్బలు తినవలసి వస్తోంది. ఇలాంటి సంఘటనల వల్లనే మనుషుల మీద మనుషులకు నమ్మకం పోతోంది .. 'మనీ' మీద ఉన్న ప్రేమ అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంత గుణవంతులైనా .. ఎంత చదువుకున్నా .. ఎంత ప్రతిభ ఉన్నా డబ్బులేకపోతే 'జీరో'గానే చూస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే మనతో కాదు, మన సక్సెస్ తో .. మన స్టేటస్ తో మాత్రమే మాట్లాడుతున్నారు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :