Saturday, 07 March 2026 09:04:50 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Rajamouli – Mahesh Babu : ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్న మహేష్ – రాజమౌళి మూవీ టీమ్.. ఒక్క వీడియో లీక్ అవ్వడంతో.. సెక్యూరిటీ కూడా..

ఒరిస్సా అడవుల్లో షూటింగ్ అవ్వడంతో ఇటీవల ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది.

Date : 10 March 2025 04:10 PM Views : 294

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rajamouli – Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాజమౌళి ఇవ్వట్లేదు. కానీ రాజమౌళి ఇప్పటికే పూజ కార్యక్రమం పూర్తి చేసి ఒక షెడ్యూల్ షూటింగ్ చేసి రెండో షెడ్యూల్ షూటింగ్ కి ఒరిస్సా వెళ్లారు. ఇన్నాళ్లు ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వకపోయినా ఏదో ఒక మ్యాటర్ మాత్రం లీక్ అయ్యేది. అయితే ఒరిస్సా అడవుల్లో షూటింగ్ అవ్వడంతో ఇటీవల ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది. ఇందులో విలన్స్ మహేష్ బాబుని పట్టుకున్నట్టు ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే వెంటనే రాజమౌళి టీమ్ ఈ వీడియోని నియంత్రించడానికి సైబర్ సెక్యూరిటీ సహాయం తీసుకొని ఆ వీడియో పోస్ట్ చేసిన ఫ్యాన్స్, నెటిజన్ల అకౌంట్స్ బ్లాక్ చేసేస్తున్నారట. దీంతో ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.

రాక రాక ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ సినిమా నుంచో ఒక చిన్న క్లిప్ లీకైంది అని ఫ్యాన్స్ సంతోషిస్తే SSMB29 టీమ్ మాత్రం గట్టిగానే సమాధానమిస్తుంది. సైలెంట్ గా ఆ వీడియో పోస్ట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని లేపేస్తుంది. ఇన్నాళ్లు ఇన్ డోర్ కాబట్టి ఎలాంటి లీక్స్ జరగలేదు. అవుట్ డోర్ వెళ్లడంతో ఫస్ట్ టైం వీడియో క్లిప్ లీక్ అయింది. దీంతో రాజమౌళి టీమ్ సెక్యూరిటీని మరింత పెంచాలని చూస్తున్నారట. సినిమా నుంచి ఎలాంటి లీక్స్ అవ్వకూడదు అని ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని మూడింతలు పెంచుతున్నారని తెలుస్తుంది. ఒరిస్సా అడవుల్లో భారీ సెక్యూరిటీ నడుమ మూవీ టీమ్ తప్ప ఎవరికీ ప్రవేశం లేకుండా దరిదాపుల్లో ఎవరూ ఫోన్స్ వాడకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు అని తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :