Sunday, 08 March 2026 03:47:14 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Manchu Manoj: మిరాయ్' సీక్రెట్ రివీల్ చేసిన మంచు మనోజ్

Date : 06 September 2025 07:26 PM Views : 361

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మిరాయ్' ఆధునిక రావణుడిగా 'బ్లాక్ స్వార్డ్' పాత్రలో మంచు మనోజ్ తన పాత్రను అడ్డుకునే శక్తివంతమైన స్టిక్ పేరే 'మిరాయ్' అని వెల్లడి నటుడు మంచు మనోజ్ పూర్తిస్థాయి నెగెటివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా చిత్ర ప్రమోషన్లలో భాగంగా మనోజ్ మాట్లాడుతూ, సినిమా టైటిల్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించారు. 'మిరాయ్' అనే పదానికి జపనీస్ భాషలో భవిష్యత్తు లేదా ఆశ అని అర్థమున్నప్పటికీ, సినిమాలో అది ఒక శక్తివంతమైన ఆయుధం పేరు అని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తాను 'బ్లాక్ స్వార్డ్' అనే ఆధునిక రావణాసురుడి పాత్ర పోషిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. "ఈ కథ పురాణాల నేపథ్యంతో ముడిపడి ఉంటుంది. అత్యంత శక్తివంతమైన తొమ్మిది పవిత్ర గ్రంథాలు నా పాత్రకు దొరికితే, అతను సంపూర్ణ రావణుడిగా మారిపోతాడు. అప్పుడు అతన్ని ఆపడానికి సాక్షాత్తూ రాముడే రావాలి. ఆ బ్లాక్ స్వార్డ్ను అడ్డుకునే ఏకైక శక్తి ఒక స్టిక్‌కు మాత్రమే ఉంటుంది. ఆ స్టిక్ పేరే 'మిరాయ్'. కథ మొత్తం ఆ స్టిక్ చుట్టూనే తిరుగుతుంది" అని మనోజ్ కథలోని కీలక అంశాన్ని వివరించారు. ఇటీవల తాను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించడంపై కూడా మనోజ్ స్పందించారు. 'భైరవం' సినిమాలో తన పాత్రకు నెగెటివ్ ఛాయలు ఉన్నప్పటికీ, 'మిరాయ్'లో పోషించింది మాత్రం పూర్తి విలన్ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. తేజ సజ్జ, మంచు మనోజ్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మనోజ్ వెల్లడించిన ఈ కొత్త విషయాలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :