Monday, 19 January 2026 06:55:06 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Ananya Panday : ఈ హీరోయిన్ అందానికి కారణం కన్నీళ్లు అంట.. అందం కోసం ఏడ్చే హీరోయిన్..

Date : 15 October 2024 10:42 AM Views : 233

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ananya Panday : ఎవరైనా నవ్వితే బాగుంటారు అంటారు. కానీ ఈ హీరోయిన్ ఏడిస్తే బాగుంటాను అంటుంది. సాధారణంగా హీరోయిన్ అందంగా కనపడటానికి, తమ అందం అలాగే కొన్నేళ్ల పాటు కొనసాగడానికి ఏవేవో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ తన అందం పెరగడానికి కారణం కన్నీళ్లు అని చెప్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే చుంకీ పాండే కూతురుగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. వరుస సినిమాలతో సందడి చేస్తుంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో కూడా మెప్పించింది. తాజాగా అనన్య పాండే ఇటీవల ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనన్య పాండే మాట్లాడుతూ.. నాకు ఏడుపు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు నా సోషల్ మీడియాలో నేను ఏడ్చే ఫొటోలు కూడా పెడతాను. కన్నీటితో నిండిన కళ్ళు నాకు సహజమైన అందాన్ని, నా ముఖంలో మెరుపుని ఇస్తాయి. నేను మాములుగా ఉన్నప్పటి కంటే ఏడుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉంటాను. చాలాసార్లు ఏడుస్తూ అద్దంలో చూసుకున్నాను. నేను సాధారణంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేను. నాకు ఆటోమేటిగ్గా కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లు నా అందాన్ని రెట్టింపు చేస్తాయి అని చెప్పింది. అలాగే ఒక్కోసారి తన అందం పెరగడానికి కావాలని ఏడుస్తాను అని కూడా చెప్పింది. దీంతో అనన్య పాండే వ్యాఖ్యలు వైరల్ గా మారగా అందం కోసం ఏడవడం ఏంటో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :