Sunday, 08 March 2026 03:52:19 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Aishwarya Lekshmi: అనుష్క శెట్టి బాటలో మరో నటి ఐశ్వర్య లక్ష్మి

Date : 13 September 2025 07:19 PM Views : 258

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సోషల్ మీడియాకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన నటి ఐశ్వర్య లక్ష్మి నా ఆలోచనలను, ఆనందాలను దూరం చేసిందంటూ భావోద్వేగ పోస్ట్ ఒక కళాకారిణిగా నన్ను నేను కాపాడుకోవడానికే ఈ నిర్ణయమన్న నటి వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటి ఐశ్వర్య లక్ష్మి, తన అభిమానులకు షాక్ ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు ఆమె ప్రకటించారు. తన మానసిక ప్రశాంతతకు, వృత్తికి ఇది ఆటంకంగా మారిందని వివరిస్తూ ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి అని తొలుత భావించానని ఐశ్వర్య తెలిపారు. కానీ, అది తన పనికి ఆటంకం కలిగించడమే కాకుండా, తన ఆలోచనలను దోచుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "చిన్న చిన్న సంతోషాలను కూడా ఇది దుఃఖంగా మార్చేసింది. అంతర్జాలం సృష్టించే ఊహలకు, అంచనాలకు అనుగుణంగా జీవించడం ఒక మహిళగా నాకు చాలా కష్టంగా మారింది" అని ఆమె తన నోట్‌లో పేర్కొన్నారు. ఒక కళాకారిణిగా తనలోని అమాయకత్వాన్ని, వాస్తవికతను కాపాడుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. "సోషల్ మీడియా లేని వారిని ఈ రోజుల్లో జనాలు మర్చిపోతారని తెలుసు. అయినా ఆ సాహసానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాలోని నటిని బతికించుకోవడానికే ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నాను" అని ఆమె వివరించారు. ఈ నిర్ణయం తన జీవితంలో బలమైన బంధాలను ఏర్పరుస్తుందని, మరిన్ని మంచి చిత్రాలలో నటించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనను ప్రేమగా గుర్తుంచుకోవాలని అభిమానులను కోరారు. ‘మామన్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఐశ్వర్య లక్ష్మి, ప్రస్తుతం ‘గట్ట కుస్తీ-2’, ‘సంబరాల ఏటిగట్టు’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆమె సోషల్ మీడియాను వీడటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే నటి అనుష్క శెట్టి కూడా సోషల్ మీడియాకు దూరమవుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు ఐశ్వర్య కూడా అదే బాట పట్టడం గమనార్హం. దీనితో కథానాయికలు వరుసగా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారనే దానిపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :