Sunday, 25 January 2026 05:38:16 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ananth Sriram: దిన దిన గండంగా ఉంది: అనంత్ శ్రీరామ్

Date : 15 September 2025 07:24 PM Views : 127

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పాటల రచయితగా అనంత్ శ్రీరామ్ కి మంచి పేరు 1500 పాటలు రాశానని వెల్లడి 19 ఏళ్ల కెరియర్ చూశానని వివరణ కొత్త ప్రయోగాలు చేయలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య తెలుగు పాటకి కొత్త సొగసులు దిద్దిన పాటల రచయితగా అనంత్ శ్రీరామ్ కనిపిస్తారు. కొన్ని పాటలలో ఆయన చేసిన పద ప్రయోగాలు గొప్పగా అనిపిస్తాయి. అలాంటి అనంత్ శ్రీరామ్ తాజాగా 'హిట్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడప్పుడు కొన్ని మంచి పాటలు రాస్తున్నప్పటికీ, దర్శక నిర్మాతలకు నాపై నమ్మకం కలగడానికి ఆరేళ్లు పట్టింది. లవ్ సాంగ్స్ తో పాటు, మాస్ సాంగ్స్ కూడా వరుస హిట్లు ఇచ్చాను" అని అన్నారు. "అయితే అందరూ లవ్ సాంగ్స్ బాగా రాయగలడు అనే ముద్రవేసి అవి మాత్రమే రాయించేవారు. దాంతో కొంతకాలం పాటు లవ్ సాంగ్స్ రాయడం ఆపేసి, మాస్ సాంగ్స్ మాత్రమే రాస్తూ వెళ్లవలసి వచ్చింది. 1500 పాటలు రాసిన తరువాత .. 19 ఏళ్ల కెరియర్ నడిచాక ఇప్పుడు నేను అనుకున్న స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. ఒక మంచి పాట రావాలంటే .. కొత్త పదాలు పడాలంటే అందుకు తగిన సాహిత్య పరిజ్ఞానం దర్శకుడికి కూడా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది" అని చెప్పారు. "ఇండస్ట్రీకి వచ్చి హీరోగా .. దర్శకుడిగా .. డీఓపీగా ట్రై చేసి విఫలమైన వాళ్లు కూడా పాటలు రాసేద్దామని అనుకునే పరిస్థితి వచ్చింది. అందరికి తెలిసిన కొన్ని పదాల పరిధిలోనే అనేక భావాలను బయటకి తీసుకురావలసి వస్తోంది. నిజం చెప్పాలంటే పాటల రచయిత పరిస్థితి దినదిన గండంగా ఉంది. పాటలు రాయాలని అనుకునేవాళ్లు తక్కువ .. అలా అనుకుని పాటల రచయితలు అయ్యేవాళ్లు తక్కువ కాబట్టి ఇంకా మా మనుగడ కొనసాగుతోంది" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :