Saturday, 07 March 2026 08:58:47 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Jetwani: న్యాయం చేయాలని చంద్రబాబును కోరిన సినీ నటి జెత్వానీ

Date : 18 March 2025 03:45 PM Views : 251

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని... ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ముంబై నటి జెత్వానీ కోరారు. అప్పటి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న 10 సెల్ ఫోన్లను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసుల కారణంగా తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.... ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర హోం మంత్రి అనిత తనకు న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ తో సజ్జన్ జిందాల్, కుక్కల విద్యాసాగర్ తనను వేధిస్తున్నారని అన్నారు. మహిళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు సుంకర పద్మశ్రీ, దుర్గా భవానీ, రమాదేవిలతో కలిసి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణను సీఐడీకి అప్పగించినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని జెత్వానీ చెప్పారు. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదని, తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన కుక్కల విద్యాసాగర్ బెయిల్ పై తిరుగుతున్నాడని... ఆయనను వెనుక నుంచి సజ్జన్ జిందాల్ నడిపిస్తున్నాడని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :