Saturday, 24 January 2026 01:49:50 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Sai Durgha Tej : పడి లేచిన కెరటం.. సాయి దుర్గా తేజ్.. 100 కోట్ల సినిమాతో గ్రాండ్ కంబ్యాక్.. బర్త్ డే స్పెషల్..

Date : 15 October 2024 11:00 AM Views : 201

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sai Durgha Tej : మెగా మేనల్లుడుగా సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమంలో విజయాల కంటే అపజయాలు ఎక్కువ పలకరించాయి. తన మామయ్యల మేనరిజంలను కాపీ చేస్తున్నాడని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడని, ఇలాగె చేస్తే కెరీర్ కష్టమే అని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. వరుసగా ఆరు ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బతుకు సో బెటర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు తేజ్. ఆల్రెడీ కెరీర్లో పడి లేచిన తర్వాత హమ్మయ్య లైఫ్ బాగానే సాగుతుంది అనుకునే సమయంలో బైక్ యాక్సిడెంట్ అయి తన జీవితాన్నే మార్చేసింది. 2021 లో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరగ్గా తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం, చాలా రోజుల తర్వాత అతి కష్టం మీద సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు. ఆ సమయంలో మామయ్య పవన్ కళ్యాణ్ తేజ్ కి అండగా నిలబడ్డాడు. తేజ్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ వచ్చారు. కోలుకున్నాడు కానీ మళ్ళీ సినిమాల్లోకి వస్తాడా అని అందరూ చర్చించుకున్నారు. మాట కూడా రాని పరిస్థితుల్లో, డ్యాన్సులు, ఫైట్లు చేయలేని పరిస్థితుల్లో కేవలం బతికి ఉన్నాను అనే పరిస్థితుల నుంచి బయటపడాలని సాయి తేజ్ గట్టిగా సంకల్పించుకున్నాడు. ఫిజియోథెరపీలు, డాక్టర్ల సలహాలు తీసుకుంటూనే తన తల్లి సహాయంతో మళ్ళీ మాట్లాడటం నేర్చుకున్నాడు. ఓ సారి యాక్సిడెంట్ తర్వాత తాను కోలుకోడానికి తన తల్లి ఎంతగా సపోర్ట్ చేసిందో, మళ్ళీ ఒక చిన్నపిల్లాడిలా తనను చూసుకుందని చెప్పాడు. అందుకే ఇటీవల తన పేరు సాయి ధరమ్ తేజ్ ని తన తల్లి పేరు జత చేసి సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నాడు. తేజ్ పూర్తిగా కోలుకోడానికి రెండేళ్లు పట్టింది. అతని కెరీర్, లైఫ్ అయిపొయింది అని అన్నవాళ్ళ నోర్లు మళ్ళీ మూయించాడు. ఈసారి కంబ్యాక్ విరూపాక్ష సినిమాతో ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అదిరిపోయేలా ఇచ్చాడు. వెంటనే మామయ్యతో కలిసి బ్రో సినిమాతో మెప్పించాడు. అయితే ఇంకా తన మాటల్లో తడబాటు, ఆరోగ్య పరంగా ఇంకా ఫిట్ అవ్వాలని కొంచెం గ్యాప్ తీసుకొని తన బాడీ, మాటలు, హెల్త్ మీద ఫోకస్ చేసి త్వరలో భారీ సినిమాతో రాబోతున్నాడు. SDT18 సినిమా ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కెరీర్ లో అయిపోయాడు అనుకున్నప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. లైఫ్ కూడా అయిపొయింది అనుకున్నప్పుడు కష్టాలు పడైనా సరే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అందుకే అందరూ సాయి తేజ్ ని పడి లేచిన కెరటం అంటున్నారు. ఇక యాక్సిడెంట్ తర్వాత లైఫ్ మరింత మార్చుకున్నాడు. అందరితో మంచిగా ఉండటం, అందరికి సపోర్ట్ చేయడం, అందరికి సాయం చేయడం.. తనలోని మంచినంతా బయటపెడుతున్నాడు. ప్రతి వారం రిలీజయ్యే ప్రతి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు తేజ్. సమస్యల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తాడు. తన మామయ్య గెలుపుని సెలబ్రేట్ చేసుకున్నాడు. వేరే వాళ్ళ సినిమా ఈవెంట్స్ కి వచ్చి సపోర్ట్ చేస్తాడు. యాక్సిడెంట్ తర్వాత కూడా చాలా మందికి దానాలు చేసాడు. అమ్మ ఆశ్రమానికి, పావలా శ్యామలకు, వరద బాధితులకు, పిల్లల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కు ఇలా దానాలు చేస్తూనే ఉన్నాడు. తనలో మంచితనం నింపుకొని పూర్తిగా తన లైఫ్ స్టైల్ మార్చుకొని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బతుకుతూ అభిమానుల కోసం సినిమాలు తీస్తూ మళ్ళీ బిజీ అవుతున్నాడు సాయి దుర్గ తేజ్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :