Thursday, 12 March 2026 04:02:22 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

పాక్‌తో యుద్ధంపై ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి ట్వీట్‌.. నెట్టింట విమ‌ర్శ‌లు

Date : 09 May 2025 01:16 PM Views : 349

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : భార‌త్‌-పాక్ స‌రిహద్దులో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, న‌టి విజ‌య‌శాంతి చేసిన సోష‌ల్ మీడియా పోస్టుపై నెట్టింట విమ‌ర్శ‌లొస్తున్నాయి. భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్థాన్‌ను కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్‌పై కొంద‌రు మండిప‌డుతున్నారు. "భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్థాన్‌ను కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్థాన్‌ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే. వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు నేటికీ భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతాయి అన్నది ఎప్పటికీ సత్యం. అయితే, కొంతమంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజలెవ్వరమూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో దేశ భ‌ద్ర‌త‌, ఐక్య‌త విష‌యంలో రాజ‌కీయాలు ఏంట‌ని? విజ‌యశాంతిపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :