Saturday, 24 January 2026 02:49:32 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

పుష్ప-2 ట్రైలర్ విడుదల బీహార్ గడ్డపై... అల్లు అర్జున్ అనౌన్స్ మెంట్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పుష్ప-2 నవంబరు 17న ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు బీహార్ రాజధాని పాట్నా వేదికగా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ఉత్తరాదిపై కన్న

Date : 11 November 2024 05:14 PM Views : 313

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ హీరోలు తమ పరిధిని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ టీజర్ ను యూపీ రాజధాని లక్నోలో విడుదల చేయగా... ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఉత్తరాదిపై కన్నేశారు. పుష్ప-2 ట్రైలర్ ను బీహార్ గడ్డపై విడుదల చేయాలని నిర్ణయించారు. పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ ను నవంబరు 17న పాట్నాలో విడుదల చేస్తున్నామని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిందో లేదు, బన్నీ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా పుష్ప-2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పుష్ప-2 మూవీ... తొలి పార్టును మించిపోయేలా ఉంటుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. దానికి తగ్గట్టే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పుష్పరాజ్ బజ్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేయడం ద్వారా మేకర్స్ తమ పంథాను స్పష్టం చేశారు. ఆలిండియా లెవెల్లో ఓపెనింగ్స్ కొల్లగొట్టాలన్నదే వారి ఉద్దేశమని అర్థమవుతోంది. అందుకే పుష్ప-2 చిత్రాన్ని ఉత్తరాది ఆడియన్స్ కు మరింత చేరువ చేసేలా ఈవెంట్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయిక కాగా... తొలిపార్టులో చివర్లో వచ్చి అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్... సెకండ్ పార్టులో ఫుల్ టైమ్ ఊపేయనున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2లో ఐటమ్ సాంగ్ ను శ్రీలీలపై తెరకెక్కిస్తున్నారు. 'కిస్సిక్' అంటూ సాగే ఈ సాంగ్ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి

Also Read : తెలంగాణ వారికే ప్రాధాన్యత: 'చిత్రపురి' ఫ్లాట్లపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :