Wednesday, 17 December 2025 02:31:55 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Pawan Kalyan : ఈ ఫోటో ఎలా మిస్ అయ్యాంరా.. లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ తో డిప్యూటీ సీఎం..

Date : 07 October 2024 11:20 AM Views : 180

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan – Trivikram – Anand Sai : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు ఏపీ ప్రభుత్వ పనులతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు అతని కూతుళ్లు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ త్రివిక్రమ్, తమన్.. ఇలా పలువురు ప్రముఖులు వెళ్లారు. తిరుమల నుంచి వీరి ఫోటోలు, వీడియోలు వచ్చి వైరల్ అయ్యాయి. అయితే ఒక స్పెషల్ ఫోటో మాత్రం చాలా తక్కువ మందికి రీచ్ అయింది. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ – ఆనంద్ సాయి కలిసి దిగిన ఫోటో ఆనంద్ సాయి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. పవన్ కళ్యాణ్ తన లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి దిగిన ఫోటో కావడంతో ఇది ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ గా మారింది. తొలిప్రేమ సినిమా కంటే ముందు నుంచి కూడా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో స్నేహం ఉంది పవన్ కళ్యాణ్ కు. ఇద్దరూ కలిసి చెన్నై లో బైక్స్ మీద తిరిగేవారు. ఆనంద్ సాయి ఆ తర్వాత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు, అంతే కాకుండా అనేక ఆలయాలను నిర్మించడంలో శిల్పిగా, వాస్తు సలహాదారుడిగా, ఆర్కిటెక్ట్ గా ప్రముఖ పాత్ర పోషించారు. పవన్ ఆనంద్ సాయి ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే ఈ ఇద్దరూ ఎక్కువగా కలిసి కనిపిస్తారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆనంద్ సాయి రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నారు. అలా తిరుమలకు పవన్ తో పాటు కలిసి వచ్చారు. ఇక త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పరిచయం జల్సా సినిమాతో మొదలయి ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారారు. వీరిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందంటే పవన్ డైరెక్ట్ త్రివిక్రమ్ ఇంటికి వెళ్లి కావాల్సింది వండించుకొని తింటాడు. ఇక పవన్ కళ్యాణ్ చేసే సినిమాల కథలు త్రివిక్రమ్ వినాల్సిందే. అలా వీరిద్దరి మధ్య కూడా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇలా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కనిపించడంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :