Saturday, 07 March 2026 08:52:00 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Posani Krishna Murali: పోసానితో జైలు గేటు వద్ద సీఐడీ పోలీసుల ఫొటోలు

ఒక రోజు విచారణలో భాగంగా నిన్న సీఐడీ కార్యాలయానికి పోసానిని తీసుకొచ్చిన అధికారులు విచారణ అనంతరం తిరిగి జైలులో అప్పగింత జైలు ప్రధాన ద్వారం వద్ద పోసానితో

Date : 19 March 2025 12:01 PM Views : 195

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టై, రిమాండ్‌లో ఉన్న సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు గుంటూరు సీఐడీ పోలీసులు క్యూకట్టారు. ఒక రోజు కస్టడీలో భాగంగా నిన్న ఉదయం ఆయనను జిల్లా జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ అనంతరం తిరిగి కోర్టులో హాజరుపరిచి జైలులో అప్పగించారు. పోసాని జైలుకు వెళ్లే సమయంలో ఆయనతోపాటు వచ్చిన సీఐడీ పోలీసులు జైలు ప్రధాన ద్వారం వద్ద పోసానితో ఫొటోలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిమాండ్ ఖైదీతో పోలీసులు ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. జ్యుడీషియల్ ఖైదీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు ఇలా విధులను పక్కనపెట్టి ఫొటోలు తీసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :