Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mazaka : సందీప్ కిషన్, రీతువర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘మజాకా’. హాస్య మూవీస్, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రసన్న కుమార్ బెజవాడ కథ, కథనంలో మజాకా సినిమా తెరకెక్కింది. రావు రమేష్, అన్షు అంబానీ, మురళి శర్మ, హైపర్ ఆది.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఫిబ్రవరి 26 శివరాత్రి కానుకగా మజాకా సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజాకా సినిమా థియేటర్స్ లో నవ్వించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.
సందీప్ కిషన్ ‘మజాకా’ సినిమా జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Admin
Studio18 News