Saturday, 07 March 2026 08:00:36 PM
# కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..? # గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Chiranjeevi: చిరంజీవికి ముద్దు పెట్టిన మ‌హిళా అభిమాని... నెట్టింట ఫొటో వైర‌ల్‌!

చిరుకు యూకే పార్ల‌మెంట్‌లో గౌరవ సత్కారం ఈరోజు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్న మెగాస్టార్‌ ఇప్ప‌టికే లండ‌న్ చేరుకున్న చిరంజీవి విమానాశ్ర‌యంలో

Date : 19 March 2025 11:25 AM Views : 296

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : యూకే పార్ల‌మెంట్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవ‌డానికి మెగాస్టార్ చిరంజీవి లండ‌న్ చేరుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డి హీత్రూ విమానాశ్ర‌యంలో చిరుకు అభిమానులు, తెలుగు ప్ర‌వాసుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ క్ర‌మంలో మెగాస్టార్‌కు బుగ్గ‌పై ఓ మ‌హిళా అభిమాని ముద్దుపెట్టి త‌న అభిమానాన్ని చాటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా, "చిన్న‌ప్పుడు చిరంజీవి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాల‌ని అల్ల‌రి చేసిన నేనే, మా అమ్మ‌ను మెగాస్టార్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లా" అని ఆ లేడీ ఫ్యాన్ కుమారుడు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా త‌న ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలాఉంటే.. చిరంజీవిని ఈరోజు యూకే పార్ల‌మెంట్‌లో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారంతో స‌త్క‌రించ‌నున్నారు. నాలుగు దశాబ్దాల‌కు పైగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ బ్రిటన్ కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ ఎంపీ న‌వేందు మిశ్రా... మెగాస్టార్‌ను ఇతర ఎంపీల సమక్షంలో స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ... సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరు చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేయనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :