Sunday, 08 March 2026 04:50:32 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Girija: నా బాల్యం కన్నీళ్ల మయం: నటి గిరిజ కూతురు సలీమా

Date : 17 September 2024 03:12 PM Views : 299

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో తెలుగు తెరపై తన జోరు చూపించిన హాస్యనటి .. గిరిజ. 1950లలో 'పరమానందయ్య శిష్యుల కథ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, మూడున్నర దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు. 300లకి పైగా సినిమాలలో నటించారు. అలాంటి గిరిజ చివరిరోజులు విషాదకరంగా ముగిశాయని చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరిజ కూతురు సలీమా, అనేక అంశాలు ప్రస్తావించారు. "మా అమ్మగారిది గుడివాడ. ఒక ట్రంక్ పెట్టెలో బట్టలు పెట్టుకుని 'చెన్నపట్టణం' వచ్చినట్టుగా చెబుతూ ఉండేది. అప్పటికే ఆమె నాటకాలు వేస్తూ ఉండేది .. బీఏ కూడా పూర్తి చేసింది. 'పాతాళభైరవి' సినిమా నుంచి ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అప్పట్లో రేలంగి - అమ్మ లేని సినిమా ఉండేది కాదు. కార్లు .. బంగ్లాలు .. నౌకర్లు .. ఇలా విలాసవంతమైన జీవితం చూశాను. కానీ ఆ తరువాత అవన్నీ మాయమవుతూ వచ్చాయి" అన్నారు. " మా అమ్మకి చాలా గొప్ప సంబంధాలు వచ్చాయట. కానీ ఆమె ఒక డిస్ట్రిబ్యూటర్ ను పెళ్లి చేసుకుంది. అతను ప్రతిరోజూ తాగుతూ .. అమ్మను కొడుతూ ఉండేవాడు. చిన్నపిల్లనని చూడకుండా నన్నూ కొట్టేవాడు. ఆయన చేసిన సినిమా బిజినెస్ వలన నష్టాలు వచ్చాయి. ఆయన ఇల్లొదిలి వెళ్లిపోయాడు. ఆ అప్పులు తీర్చడం కోసం మా ఆస్తులన్నీ అమ్మేయవలసి వచ్చింది. అలా ఆర్ధికంగా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. నాన్న పెట్టే హింస .. అమ్మ కష్టాలు చూస్తూనే పెరిగాను" అని చెప్పారు. " నా అసలు పేరు కాళేశ్వరి .. అమ్మ మతం మారినప్పుడు సలీమా అనే పేరు పెట్టారు. అమ్మపేరు కూడా 'కరీమా బేగం'గా మార్చుకుంది .. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఆ సమయంలో శోభన్ బాబు గారు .. అల్లు రామలింగయ్య గారు తప్ప, ఇండస్ట్రీ నుంచి ధైర్యం చెప్పినవారు లేరు. అమ్మ దిక్కులేని స్థితిలో బస్టాండులో చనిపోయారనే ప్రచారం నాకు బాధను కలిగించింది.. అందులో నిజం లేదు. మా అమ్మ మా ఇంట్లోనే చనిపోయింది" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :