Saturday, 24 January 2026 01:28:22 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

'ఏనుగుతొండం ఘటికాచలం'(ఈటీవీ విన్)మూవీ రివ్యూ!

Date : 13 November 2025 06:32 PM Views : 218

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రవిబాబు దర్శకత్వం వహించిన సినిమా వినోదప్రధానమైన కథ ఆసక్తికరంగా నడిచే కథనం ఆకట్టుకునే కంటెంట్ సరదాగా సాగిపోయే సన్నివేశాలు రవిబాబు నటుడిగా .. దర్శకుడిగా కూడా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. విలక్షణమైన నటుడిగా .. విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందినదే 'ఏనుగుతొండం ఘటికాచలం'. ఆయనే నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ: ఘటికాచలం (నరేశ్) 65 ఏళ్లకి దగ్గరలో ఉంటాడు. భార్య దుర్గా (రాజ్యలక్ష్మి)ని కోల్పోయిన ఆయన, తన కొడుకులు .. కోడళ్లతో కలిసి హైదరాబాదులో నివసిస్తూ ఉంటాడు. పెద్ద కొడుకు అరుణాచలం (గిరిధర్) పెద్ద కోడలు దేవి (ప్రశాంతి) చిన్న కొడుకు భద్రాచలం (విజయ్ భాస్కర్) చిన్నకోడలు రాణి (శిరీష) ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు. కొడుకులిద్దరూ ఎలాంటి ఉద్యోగం చేయకపోవడంతో, ఘటికాచలానికి ప్రతి నెలా వచ్చే 'పెన్షన్' పైనే ఇల్లు నడుస్తూ ఉంటుంది. ఘటికాచలానికి ఆ ఇంట్లో ఎలాంటి ప్రేమానురాగాలు .. గౌరవ మర్యాదలు ఉండవు. ఆయన పెన్షన్ తోనే తప్ప, ఆయనతో ఎవరికీ పనుండదు. ఒంటరితనంతో బాధపడుతున్న ఆయన, తనకి ఓ తోడు అవసరమని భావిస్తాడు. పనిమనిషిగా ఉన్న భవాని (వర్షిణి) మాత్రమే తనని కాస్త పట్టించుకోవడం ఆయనకు ఊరట కలిగిస్తుంది. దాంతో ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా, ఆయన భవానిని వివాహం చేసుకుంటాడు. ఇకపై 'పెన్షన్ కూడా భవానియే తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన మిగతా వాళ్లకు ఆందోళన కలిగిస్తుంది. ఘటికాచలంతో ఇన్సూరెన్స్ చేయించి, ఆయనను చంపేయాలని నిర్ణయించుకుంటారు. భవానితో పెళ్లి రిజిస్టర్ కాలేదు గనుక, ఆమెను తేలికగానే వెళ్లగొట్టొచ్చని అనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? వాళ్లు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ. విశ్లేషణ: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా .. ఎటువంటి కష్టం తెలియకుండా పెంచుతుంటారు. అందుకోసం ఎన్నో కష్టాలను ఆనందంగా భరిస్తుంటారు. అయితే ఆ తల్లిదండ్రులలో ఎవరు తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినా, ఆ బాధను ఇతర కుటుంబ సభ్యులెవరూ అర్థం చేసుకోరు. తమ సుఖాల కోసం పెద్ద దిక్కును కూడా అడ్డు తప్పించుకోవాలనే ఆలోచన చేస్తారు. అలాంటి ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథను రవిబాబు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. చాలా తక్కువ పాత్రలతో రవిబాబు ఈ కథను రాసుకున్నాడు. అయితే అనవసరంగా ఏ పాత్ర కనిపించదు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత .. ప్రయోజనం ఉంటాయి. పిల్లలపై ప్రేమ .. డబ్బు పట్ల ఆశ .. పరస్త్రీల పట్ల వ్యామోహం అనే బలహీనతల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఆయా బలహీనతల వెంట పరిగెత్తే ఆ పాత్రలు సరదాగా నవ్వులు పూయిస్తూ ఉంటాయి. అలీ .. చిత్రం శ్రీను .. రఘుబాబు పోషించిన అతిథి పాత్రలు కూడా సందర్భానుసారం సందడి చేస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరాలు ఉంటాయి .. ఆశలు ఉంటాయి ... సమస్యలు ఉంటాయి .. వ్యామోహాలు ఉంటాయి. అయితే చివరికి వచ్చేసరికి వాటన్నిటికీ కావలసిందే డబ్బే. ఆ డబ్బు కోసం మనుషులు ఎలా మారిపోతారనేది రవిబాబు ఈ చిన్న కథలోనే ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు. సహజత్వానికి దగ్గరగా ఆయన డ్రామాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. పనితీరు: ఒక చిన్న సినిమా ద్వారా బలమైన కంటెంట్ ను ఆవిష్కరించడంలో రవిబాబుకి మంచి నైపుణ్యం ఉంది. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. అదే విషయాన్ని మరోసారి నిరూపించేదిగా ఈ సినిమా కనిపిస్తుంది. చాలా నీట్ గా .. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా చూసేలా ఆయన ఈ సినిమాను రూపొందించిన తీరు మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో నరేశ్ మొదలు వాసు ఇంటూరి .. శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులంతా చాలా బాగా చేశారు. చరణ్ మాధవన్ ఫొటోగ్రఫీ .. సత్యనారాయణ భల్లా ఎడిటింగ్ .. రాజేశ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి. ముగింపు: పరిమితమైన పాత్రలతో .. ఒక చిన్న ఇంట్లో జరిగే చిన్న డ్రామా ఇది. మొదలైన దగ్గర నుంచి చివరివరకూ సందడిగా సాగుతుంది. ఎక్కడా బోర్ అనిపించదు. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే ఈ సినిమా, ఫైనల్ ట్విస్ట్ తో మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. Movie Details Movie Name: Yenugu Thondam Ghatika Chalam Release Date: 2025-11-13 Cast: Naresh, Giridhar, Vijay Bhaskar, Prashanthi, Sirisha, Ravibabu, Vasu Inturi Director: Ravibabu Music: S S Rajesh Banner: Flying Frogs Productions Review By: Peddinti Yenugu Thondam Ghatika Chalam Rating: 2.50 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :