Thursday, 12 March 2026 04:02:50 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Sukumar: 'పుష్ప-3'పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సుకుమార్

Date : 06 September 2025 07:49 PM Views : 340

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దుబాయ్ లో సైమా అవార్డుల కార్యక్రమం పుష్ప-3 కచ్చితంగా ఉంటుందంటూ సుకుమార్ ప్రకటన అల్లు అర్జున్ అభిమానుల్లో అంబరాన్నంటిన సంబరాలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 3’ చిత్రంపై దర్శకుడు సుకుమార్ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ సినిమా మూడో భాగం కచ్చితంగా ఉంటుందని ఆయన అధికారికంగా ప్రకటించారు. దుబాయ్ లో ఘనంగా జరిగిన సైమా 2025 అవార్డుల వేడుక ఈ కీలక ప్రకటనకు వేదికైంది. దీంతో ‘పుష్ప 3’పై కొంతకాలంగా నెలకొన్న అనుమానాలకు తెరపడినట్లయింది. సైమా 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ‘పుష్ప 2’ చిత్రం సత్తా చాటింది. అత్యధిక విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న ఈ సినిమా ఏకంగా ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ మహాదేవన్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ దర్శకుడి అవార్డును స్వీకరించిన అనంతరం సుకుమార్ మాట్లాడుతూ, అభిమానులకు అదిరిపోయే తీపి కబురు చెప్పారు. “పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది” అని ఆయన వేదికపై నుంచి ప్రకటించడంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గతంలో ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ పేరుతో ఓ పోస్టర్ బయటకు వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో ప్రాజెక్ట్‌పై సందేహాలు అలముకున్నాయి. అయితే, సుకుమార్ తాజా ప్రకటనతో ఆ ఊహాగానాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పడింది. ఈ ప్రకటనతో పుష్ప ఫ్రాంచైజీ కొనసాగింపుపై పూర్తి భరోసా లభించినట్లయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :