Sunday, 08 March 2026 10:00:13 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

కథానాయిక కీర్తి సురేశ్ పెళ్లి ముహూర్తం కుదిరిందా?

స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకోనున్న కీర్తి సోషల్‌ మీడియాలో ఊపందుకున్న పెళ్లి ప్రచారం డిసెంబర్‌ 11న గోవాలో వివాహం?

Date : 19 November 2024 02:01 PM Views : 368

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. 'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ కీర్తి సురేశ్ ఈ చిత్రం తరువాత తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్‌గా బిజీ అయ్యారు. 'మహానటి' చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును పొందిన కీర్తి ప్రస్తుతం సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తున్నారు. అయితే ఆమె త్వరలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. దుబాయ్‌లో స్థిరపడిన కొచ్చికి చెందిన ఆంటోని తట్టిల్‌తో కీర్తిసురేశ్ ‌కు పదిహేను సంవత్సరాల స్నేహబంధం ఉంది. త్వరలో వీరి స్నేహబంధం పెళ్లితో భార్యాభర్తల అనుబంధంగా మారనుంది. ఇందుకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారట. డిసెంబర్‌ 11న వీరి వివాహం గోవాలో జరగనుందని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఇప్పటికే కీర్తి సురేశ్ టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కొంత మంది హీరోలకు శుభలేఖలు కూడా ఇచ్చారని చెబుతున్నారు. అత్యంత ఆత్మీయులు, స్నేహితుల మధ్య సింపుల్‌ గా వీరి వివాహ వేడుక జరుగుతుందని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది.

Also Read : 5 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న సునీతా విలియమ్స్ ఏం తింటున్నారో తెలుసా?

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :