Thursday, 12 March 2026 12:08:21 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్!

Date : 22 January 2026 07:23 PM Views : 147

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'మార్క్' గా కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 50 కోట్లకి పైగా వసూలు చేసిన సినిమా యాక్షన్ వైపు నుంచి దక్కిన మార్కులు ఈ నెల 23 నుంచి హాట్ స్టార్ లో కిచ్చా సుదీప్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందువల్లనే అతని కన్నడ సినిమాలు తెలుగులోను విడుదలవుతూ ఉంటాయి. అలా కన్నడలో ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'మార్క్' సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కన్నడలో డిసెంబర్ 25వ తేదీన విడుదలైంది. త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమా అక్కడ 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. జనవరి 1వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఇక్కడి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమాను గురించి ఇక్కడ పట్టించుకున్నవారు లేరు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 23వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. షైన్ టామ్ చాకో .. నవీన్ చంద్ర .. విక్రాంత్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్కండేయ ఒక పోలీస్ ఆఫీసర్. అయితే కొన్ని కారణాల వలన ఆయన సస్పెన్షన్ లో ఉంటాడు. అయితే 'మార్క్'గా ఆయన రౌడీల ఆటకట్టిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక మాఫియా ముఠాతో పెట్టుకోవలసి వస్తుంది. అప్పటి నుంచి ఆయన మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు మార్క్ ఏం చేస్తాడు? తనకి ఎదురైన అవరోధాలను ఎలా అధిగమిస్తాడు? అనేది కథ. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం .. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనే ఒక టాక్ కన్నడ థియేటర్ల దగ్గర వినిపించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :