Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ సినీ నటుడు దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘టాక్ షో ది రానా దగ్గుబాటి షో’ .. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టాక్ షోలు బాగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకునే పాడ్‌కాస్ట్‌లకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో టాక్‌షోలకు మంచి స్పందన ఉంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను ఎప్పటి నుంచో ఆమెజాన్ ప్రైమ్ వాళ్లతో కలిసి పని చేయాలని అనుకున్నట్లుగా రానా వెల్లడించారు. చాలా ఆలోచనల తర్వాత టాక్ షో చేద్దామని నిర్ణయానికి వచ్చినట్లు రానా తెలిపారు. ప్రభాస్, బాలకృష్ణలను ఈ టాక్ షోకు ఆహ్వానించాలని ఉందని రానా అన్నారు. దీనిపై వారితో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Also Read : బాబ్బాబు.. మీరు ఆఫీసులకు రావొద్దు.. ఇంటి నుంచే పని చేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం వినతి
Admin
Studio18 News