Monday, 19 January 2026 07:05:22 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Suma Kanakala: నా భర్త రాజీవ్ కు యాక్సిడెంట్ అవుతుందని నాకు ముందే కల వచ్చింది: సుమ

Date : 08 November 2025 06:56 PM Views : 229

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తన భర్త రాజీవ్ కనకాల ప్రమాదంపై సుమ సంచలన వ్యాఖ్యలు ఆయనకు యాక్సిడెంట్ అవుతుందని ముందే కలలో చూశానన్న యాంకర్ షూటింగ్‌లో కారు చెట్టుకు ఢీకొని రాజీవ్‌కు గాయాలయ్యాయని వెల్లడి వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు సర్వసాధారణమని వ్యాఖ్య ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన, షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తన భర్త, నటుడు రాజీవ్ కనకాలకు ప్రమాదం జరుగుతుందని తనకు ముందే కలలో కనిపించిందని, ఆ కల నిజమైందని ఆమె వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుమ, తన కెరీర్‌తో పాటు రాజీవ్‌తో బంధం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ, "నాకు కొన్నిసార్లు వచ్చే కలలు నిజమవుతుంటాయి. ఒకసారి రాజీవ్‌కు షూటింగ్‌లో యాక్సిడెంట్ అయి కాలు విరిగినట్లు కల వచ్చింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. ఆయన తలకోనలో షూటింగ్‌లో ఉన్నారు. ఒక రోజంతా ఆయన నుంచి ఫోన్ రాకపోవడంతో కంగారుపడ్డాను. తర్వాత ఫోన్ చేసి 'బానే ఉన్నావా?' అని అడగ్గానే, 'నిజంగానే నాకు కాలు విరిగింది. డ్రైవ్ చేస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది' అని రాజీవ్ చెప్పాడు. దీంతో నేను వెంటనే అక్కడికి వెళ్లి ఆయన్ను చూసి ఆసుపత్రికి తీసుకెళ్లాను" అని సుమ వివరించారు. ఇలాంటి కలలు ఒక్కోసారి భయపెడతాయని ఆమె అన్నారు. ఇదే సమయంలో, తమ విడాకులపై ఎప్పటినుంచో వస్తున్న వదంతులపై కూడా సుమ స్పందించారు. తమ బంధం గురించి వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. "మా పెళ్లై 25 ఏళ్లు దాటింది. ఏ బంధంలోనైనా ఒడుదుడుకులు ఉంటాయి. మా జీవితం కూడా ఓ రోలర్‌కోస్టర్ లాంటిదే. కెరీర్, పిల్లలు, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో మనస్పర్థలు రావడం సహజం. అయితే కొందరు మేం విడాకులు తీసుకున్నామని రాశారు. మేమిద్దరం కలిసి వీడియోలు పెట్టినా, 'ఏంటి మీరు ఇంకా కలిసే ఉన్నారా? విడిపోలేదా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొదట్లో బాధగా అనిపించినా, ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు" అని సుమ స్పష్టం చేశారు. కెరీర్ ఆరంభంలో యాక్టింగ్ కాకుండా వ్యాపార రంగంలోకి వెళ్లమని రాజీవ్ తనకు సూచించారని, కానీ పెళ్లి తర్వాత ఆయన కుటుంబానికి సినిమాపై ఉన్న ప్రేమను తాను అర్థం చేసుకున్నానని సుమ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :