Thursday, 12 March 2026 01:15:13 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Rohit Sharma: ఆ వెబ్ సిరీస్ చూడకుండా ఉండలేను: రోహిత్ శర్మ

Date : 23 December 2025 06:43 PM Views : 112

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : స్ట్రేంజర్ థింగ్స్' ఫైనల్ సీజన్ ప్రమోషన్‌లో రోహిత్ శర్మ విలన్ వెక్నాకు ఫీల్డింగ్ సెట్ చేశానంటూ హిట్‌మ్యాన్ డైలాగ్ క్రికెట్, సిరీస్‌ను కలుపుతూ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన వీడియో డిసెంబర్ 26న విడుదల కానున్న చివరి సీజన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' ఫైనల్ సీజన్ ప్రమోషన్‌లో ఈ హిట్ మ్యాన్ కనిపించి సందడి చేశాడు. ఈ సిరీస్‌లోని ప్రధాన విలన్ అయిన 'వెక్నా'కు ఫీల్డింగ్ సెట్ చేశానంటూ రోహిత్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ ప్రమోషనల్ వీడియోలో, రోహిత్ శర్మ ఒక లాకర్ రూమ్‌లో తన టీమ్‌కు సూచనలు ఇస్తూ కెప్టెన్‌గా కనిపించాడు. "ఫైనల్ సీజన్ వస్తోంది. ప్రత్యర్థి మైండ్ గేమ్స్ ఆడినప్పుడు ఏ హెల్మెట్ కాపాడలేదు" అంటూ క్రికెట్ పరిభాషలో సిరీస్ తీవ్రతను వివరించాడు. ఈ సందర్భంగా 'వెక్నా' అనే విలన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తన బృందాన్ని హెచ్చరించాడు. ఈ ప్రచారంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ, "నేను చాలా ఏళ్లుగా 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్‌కు పెద్ద అభిమానిని. ఆ సిరీస్ చూడకుండా ఉండలేను. ఇప్పటివరకు ఎంతో ఆసక్తిగా ఈ షో చూశాను. ఇప్పుడు దీని ఫైనల్ సీజన్ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వెక్నా ఫీల్డింగ్ అయితే నేను సెట్ చేసేశా" అని సరదాగా వ్యాఖ్యానించాడు. 1980ల నేపథ్యంలో సాగే 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్, హాకిన్స్ అనే కాల్పనిక పట్టణంలో జరిగే అతీంద్రియ ఘటనల చుట్టూ తిరుగుతుంది. 'అప్‌సైడ్ డౌన్' అనే మరో ప్రపంచం, రహస్య ప్రభుత్వ ప్రయోగాలు వంటి అంశాలతో ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కాగా, ఈ సిరీస్ చివరి సీజన్ (సీజన్ 5, వాల్యూమ్ 2) డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :