Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు ముగిసింది. నిన్న ఆదివారం ఎపిసోడ్ లో నాలుగో వారం కంటెస్టెంట్ గా ఆర్జీవీ భామ సోనియా ఎలిమినేట్ అయింది. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ చివరికి సోనియా, నాగ మణికంఠ మిగలగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నే ఎవరిని బయటకు పంపించాలో చెప్పమన్నాడు నాగ్. నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగిలిన కంటెస్టెంట్స్ అంతా నాగ మణికంఠకు సపోర్ట్ చేసారు. దీంతో సోనియా ఎలిమినేట్ అయింది. అయితే మణి డేంజర్ జోన్ లో ఉన్నాడని, ఈ ఎపిసోడ్ తర్వాత మణికంఠ కొన్ని రోజులు జైల్లో ఉండాలని చెప్పాడు నాగార్జున. ఇప్పటికి నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండొచ్చని తెలుస్తుంది.
Admin
Studio18 News