Monday, 08 December 2025 03:26:56 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Srikanth Odela : సమంత మా అక్కలాంటిది, ఇండస్ట్రీకి దొరికిన వరం.. సురేఖ గారు మాట్లాడింది కరెక్ట్ కాదు.. దసరా డైరెక్టర్ వ్యాఖ్యలు..

Date : 03 October 2024 10:39 AM Views : 192

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Srikanth Odela – Konda Surekha : కొండా సురేఖ.. నాగచైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలని విమర్శిస్తూ సినీ పరిశ్రమ అంతా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు కొండా సురేఖ కామెంట్స్ పై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా ఈ ఇష్యూపై స్పందించాడు. గతంలో శ్రీకాంత్ ఓదెల రంగస్థలం సినిమాకు పనిచేసాడు. దీంతో సమంతతో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసాడు. శ్రీకాంత్ ఓదెల తన సోషల్ మీడియాలో.. ఇలాంటి కొన్ని అసహ్యకరమైన కామెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడటం దురదృష్టకరం. పవర్, పొజిషన్ గౌరవాన్ని తీసుకురావని ఇది చూస్తుంటే తెలుస్తుంది. రంగస్థలం సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. 365 రోజులు ప్రతిరోజు సమంత మేడంని దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. సమంత మేడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్ గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కలా అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికే సినీ పరిశ్రమలో పనిచేయాలి అనుకునే మహిళలకు చాలా అడ్డంకులు, భయాలు ఉన్నాయి. ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు ఆ భయాలను ఇంకా పెంచుతాయి. సినీ పరిశ్రమలోనే కాదు స్త్రీ, పురుష అసమానతలు అన్నిచోట్లా ఉన్నాయి. మహిళలు ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా, అవి తప్పు అని నిరూపించాలని, జీవితాల్లో ఎదగాలని, సినీ పరిశ్రమలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. సినిమా ఒక కళారూపం. మీరు గౌరవించకపోయినా పర్వాలేదు కాని సినిమాని, సినీ వ్యక్తులను అగౌరవపరచకండి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ టైంలో ఇలాంటి ఇష్యూ రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో శ్రీకాంత్ ఓదెల ట్వీట్ వైరల్ గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :