Sunday, 08 February 2026 09:46:27 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

బాల‌య్య కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. వీడియో వైర‌ల్‌!

Date : 14 June 2025 11:54 AM Views : 560

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నటి సంయుక్త మీనన్‌తో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక నగల దుకాణాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఏలూరులో జరిగిన నగల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, తన రాబోయే చిత్రం ‘అఖండ 2’ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా నిర్మాణం పూర్తయిందని, చాలా బాగా వచ్చిందని ఆయన తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నటి సంయుక్త మీనన్, బాలయ్య‌ పట్ల గౌరవపూర్వకంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలకృష్ణ ఇతరులతో మాట్లాడుతుండగా.. సంయుక్త వెనుక నుంచి వచ్చి ఆయన కాళ్లు మొక్కారు. ఈ అనూహ్య పరిణామానికి బాలకృష్ణ క్షణకాలం ఆశ్చర్యపోయినప్పటికీ, వెంటనే తేరుకుని ఆమెను "దీర్ఘాయుష్మాన్ భవ" అని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. https://x.com/BalayyaUvasena/status/1933570115356017151?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1933570115356017151%7Ctwgr%5Ebedb3f5f158169df4981e3a8d8b446564fc62029%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F832545%2Fnandamuri-balakrishna-blesses-samyuktha-menon-after-she-touches-his-feet

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :