Saturday, 24 January 2026 03:05:51 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Jaya Bachchan: 14 ఏళ్లు నటనకు దూరంగా ఉండటానికి కారణం ఇదే: జయా బచ్చన్

Date : 08 December 2025 07:04 PM Views : 174

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తన కూతురు కోసమే నటనకు దూరమయ్యానన్న జయ 'అమ్మా.. పనికి వెళ్లొద్దు' అని చిన్నారి శ్వేత అనేదని వెల్లడి ఆ మాటతో తల్లి అవసరం ఎంతో తనకు అర్థమైందన్న జయ బాలీవుడ్ సీనియర్ నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో తాను 14 ఏళ్ల పాటు సినిమాలకు ఎందుకు విరామం తీసుకోవాల్సి వచ్చిందో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కూతురు శ్వేతా బచ్చన్ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. 1981లో 'సిల్సిలా' చిత్రం తర్వాత జయా బచ్చన్ నటనకు దూరంగా ఉన్నారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ, "ఒకరోజు నేను షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, చిన్నారి శ్వేత నా దగ్గరకు వచ్చింది. ‘అమ్మా, నువ్వు పనికి వెళ్లొద్దు, నాన్నను మాత్రమే వెళ్లమను’ అని చాలా అమాయకంగా అడిగింది. ఆ మాట నా హృదయాన్ని తాకింది. తన పెంపకంలో తల్లి తోడు ఎంత అవసరమో అర్థమైంది. అందుకే వెంటనే సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నాను" అని జయా బచ్చన్ వివరించారు. అయితే, మళ్లీ సినిమాల్లోకి రావడానికి కూడా తన కూతురే కారణమని ఆమె చెప్పారు. "శ్వేతకు వివాహమై అత్తారింటికి వెళ్ళిపోయాక ఇంట్లో ఒంటరితనం నన్ను ఆవహించింది. ఆ బాధను తట్టుకోలేక చాలాసార్లు ఏడ్చాను. దానిని జయించడానికే మళ్లీ నటన వైపు వచ్చాను" అని తెలిపారు. 1995లో ‘డాటర్స్ ఆఫ్ ది సెంచరీ’ చిత్రంతో జయా బచ్చన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్న ఆమె, చివరగా 2023లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ చిత్రంలో కనిపించారు. కూతురు కోసం కెరీర్‌ను పక్కనపెట్టిన జయా బచ్చన్ నిర్ణయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :