Tuesday, 10 February 2026 04:01:32 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ!

Date : 07 February 2026 07:06 PM Views : 43

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన సినిమానే 'పరాశక్తి'. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శ్రీలీల .. రవి మోహన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. అలాంటి ఈ సినిమాను ఈ రోజు ( ఫిబ్రవరి 7వ) తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. తమిళంతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ కథ 1959లో 'తిరుచిరాపల్లి'లో మొదలవుతుంది. హిందీని అధికార భాషగా బలవంతంగా రుద్దాలనే ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం రావడంతో ఈ కథ మొదలవుతుంది. దాంతో మాతృ భాష పట్ల గల మమకారం వలన, తమిళ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని మదురై .. చిదంబరం ప్రాంతాల నుంచి అక్కడి కాలేజ్ స్టూడెంట్స్ నిరసనలు .. ర్యాలీలు నిర్వహిస్తుంటారు. కాలేజ్ కుర్రాళ్ల వైపు నుంచి జరిగే ఈ ఉద్యమంలో 'చిన్న దురై' (అథర్వ) ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఈ విషయంలో అతని అన్నయ్య చెళియన్ ( శివకార్తికేయన్) అండగా నిలబడతాడు. గతంలో జరిగిన గొడవల కారణంగా తన స్నేహితుడు గోవింద్ ను కోల్పోయిన చెళియన్, ఆ తరువాత తన పని తాను చేసుకు వెళుతుంటాడు. అయితే తమ్ముడు ఈ కేసులో చిక్కుకోవడం వలన అతని భవిష్యత్తు దెబ్బతింటుందేమోనని మళ్లీ రంగంలోకి దిగుతాడు. అదే ఊళ్లోని రేడియోస్టేషన్లో రత్నమాల పనిచేస్తూ ఉంటుంది. ఆమె భన్వర్ లాల్ అనే ఒక ఎంపీ కూతురు. చెళియన్ చేసేది రైల్లో బొగ్గువేసే పని అయినప్పటికీ, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆమె ఇష్టపడుతుంది. అతను కూడా ఆమెను ఆరాధిస్తూ ఉంటాడు. హిందీ భాష వ్యతిరేక ఉద్యమంలో పోరాడే అతనికి, రత్నమాల కూడా తనవంతు సాయాన్ని అందిస్తూ ఉంటుంది. అయితే ఈ పోరాటం చేసే విద్యార్థి సంఘాలను అణగదొక్కడానికి ఓ పోలీస్ అధికారి ప్రయత్నిస్తూ ఉంటాడు .. అతని పేరే 'తిరునాథన్' ( రవి మోహన్). మదరాసి అయిన తండ్రి పట్ల అతనికి గల ద్వేషం, ఆ ప్రాంతంపైనే పగగా మారుతుంది. ఈ ఉద్యమానికి సంబంధించిన గొడవలలో తనని గాయపరిచిన చెళియన్ కోసం అతను గాలిస్తూ ఉంటాడు. హిందీ వ్యతిరేక ఉద్యమం ఎక్కడి వరకూ వెళుతుంది? అందుకోసం రంగంలోకి దిగిన చెళియన్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? తిరునాథన్ కోరిక నెరవేరుతుందా? చెళియన్ ప్రేమ ఫలిస్తుందా? అనేది కథ. 1950 - 60 ప్రాంతంలో తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించడం .. అనూహ్యమైన స్థాయిలో అందుకు వ్యతిరేకత రావడానికి సంబంధించిన నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. కథ మొత్తం ఆ కాలంలోనే నడిచేది కావడం వలన, ఆనాటి సామాజిక వాతావరణాన్ని తెరపై చూపించడం నిజంగా చాలా కష్టమైన విషయం. కాస్ట్యూమ్స్ మొదలు అప్పటి వస్తువులు .. వాహనాల విషయంలో దృష్టి పెట్టే విషయంలో సుధా కొంగరకి మంచి మార్కులు పడతాయి. ఇక ఈ సినిమాలో శివకార్తికేయన్ .. అతని తమ్ముడు పాత్రలో అథర్వ .. శివకార్తికేయన్ మనసు పడిన రత్నమాలగా శ్రీలీల.. ప్రతినాయకుడిగా రవి మోహన్ పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే ఈ పాత్రలెవీ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా డిజైన్ చేయబడలేదనే అనిపిస్తుంది. పాత్రల మధ్య క్లారిటీ లోపించడం కూడా కనిపిస్తుంది. కథానాయకుడే ఒకానొక సందర్భంలో ఈ ఉద్యమంలో నుంచి బయటికిపోయి, తిరిగి వెనక్కి రావడం, ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీస్తుంది. ఇక ప్రతినాయకుడి విషయానికి వస్తే, తన తండ్రి పట్ల గల అసహనం .. హీరో పట్ల గల కోపం కారణంగా తమిళ ప్రజలందరి పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడం చిత్రంగా అనిపిస్తుంది. ఆయన ఆ పాత్రలో ఆవేశపరుడైన ఒక అధికారిగా కాకుండా ఉన్మాదిలా కనిపిస్తాడు. హీరో - హీరోయిన్స్ వైపు నుంచి లవ్ కీ .. రొమాన్స్ కి అవకాశం ఉన్నప్పటికీ, పెద్దగా పట్టించుకోలేదు. ఇక అథర్వ పాత్రవైపు నుంచి ఎమోషన్స్ ను కూడా కనెక్ట్ చేయలేకపోయారు. కథలో ప్రధానంగా కనిపించే సమస్య భాషకి సంబంధించినది మాత్రమే. ఆ అంశంపై మాత్రమే పూర్తిగా ఫోకస్ చేశారు. ఆ ప్రధానమైన అంశం చుట్టూ ఆడియన్స్ కోరుకునే ఇతర అంశాలేవీ కనిపించవు. వ్యూహాలు .. త్యాగాలు ఉన్నాయిగానీ, ఆ ఎమోషన్స్ ను మనసుకు దగ్గరగా తీసుకుని వెళ్లలేకపోయారు. అన్నదమ్ములకి సంబంధించిన సన్నివేశాలలో ఎమోషన్స్ ను రాబట్టడానికి ప్రయత్నం చేశారుగానీ ప్రయోజనం దక్కలేదు. ఒక ప్రాంతానికి సంబంధించిన కథగా భారీతనాన్ని మాత్రమే తీసుకురాగలిగారని చెప్పాలి. రవి కె చంద్రన్ ఫొటోగ్రఫీ .. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం .. సతీశ్ సూర్య ఎడిటింగ్ ఫరవాలేదు.ఒక యథార్థ సంఘటనను తెరపైకి తీసుకుని రాగలిగారు. ఆ కాలానికి సంబంధించిన సామజిక వాతావరణాన్ని కళ్లముందుంచారు. అయితే కథలోని ఆత్మ, ఆడియన్స్ ను కదిలించలేకపోయింది. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలను .. సంభాషణలను ఆవిష్కరించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే, ఈ సినిమాకి 'పరాశక్తి' అనే టైటిల్ ను ఎందుకు సెట్ చేశారనేది మనకి అర్థంకాని ప్రశ్నలా అలా మిగిలిపోతుందంతే Movie Details Movie Name: Parasakthi Release Date: 2026-02-07 Cast: Sivakarthikeyan,Ravi Mohan, Atharvaa, Sreeleela,Kulappulli Director: Sudha Kongara Music: G V Prakash Kumar Banner: Dawn Pictures Review By: Peddinti Parasakthi Rating: 2.00 out of 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :