Thursday, 12 March 2026 03:33:09 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

అఖిల్ వివాహం.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం

Date : 31 May 2025 01:15 PM Views : 271

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అక్కినేని ఇంట మ‌రోసారి పెళ్లిబాజాలు మోగ‌నున్నాయి. గ‌తేడాది నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య-శోభితా వివాహ‌ బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న‌ చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో గతేడాది నవంబర్ 26న అఖిల్ నిశ్చితార్థం జ‌రిగింది. జూన్ 6న అఖిల్‌- జైనబ్‌ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. దీంతో త‌న కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున ఆహ్వానించారు. ఈరోజు ఉద‌యం భార్య అమ‌ల‌, వియ్యంకుల‌తో క‌లిసి జూబ్లీహిల్స్ లోని ముఖ్య‌మంత్రి నివాసంలో ఆయ‌న‌ను క‌లిశారు. అనంత‌రం అఖిల్ వెడ్డింగ్ కార్డుని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. కాగా, అన్న‌పూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :