Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Gautam Ghattamaneni : మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం న్యూయార్క్‌లో చదువుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్నాడు. యాక్టింగ్, సినిమాకు సంబంధించిన కోర్స్ చేస్తుండటంతో మహేష్ అభిమానులు గౌతమ్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. గౌతమ్ అమెరికాలో తనతో చదివే ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. దీంతో అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఇటీవల తాను ఉండే రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయగా తాజాగా తన ఫ్రెండ్స్ తో రాత్రి పూట బయటకు వెళ్లిన ఫోటోలు షేర్ చేసాడు గౌతమ్. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. లిమిట్ యూనివర్సిటీ పార్ట్ 4 అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా గౌతమ్ చదువుకుంటూనే అమెరికాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Admin
Studio18 News