Monday, 19 January 2026 07:32:49 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Dhruv Vikram: నాన్నలాగే కష్టపడి పేరు తెచ్చుకుంటా: విక్రమ్ తనయుడు ధ్రువ్

Date : 22 October 2025 06:44 PM Views : 265

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలుగు ప్రేక్షకుల ముందుకు తమిళ హిట్ 'బైసన్' ఈ నెల‌ 24న జగదంబే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్ మూడేళ్లు కబడ్డీ నేర్చుకున్నానన్న హీరో ధ్రువ్ విక్రమ్ షూటింగ్‌లో చేయి విరగ‌డంతో పాటు మూడు పళ్లు దెబ్బతిన్నాయని వెల్ల‌డి ధ్రువ్ డెడికేషన్‌కు ఆశ్చర్యపోయానన్న అనుపమ పరమేశ్వరన్ అర్జున అవార్డు గ్రహీత జీవిత కథ ఆధారంగా చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించిన ‘బైసన్’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చిత్ర కథానాయకుడు ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వివరించారు. ఈ పాత్ర కోసం సుమారు మూడేళ్లు కష్టపడ్డానని, కబడ్డీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని తెలిపారు. చిత్రీకరణ సమయంలో పలుమార్లు గాయపడినట్లు, ఎడమ చేయి విరగడంతో పాటు మూడు పళ్లు కూడా దెబ్బతిన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. "ఈ సినిమా కోసం హైదరాబాద్ ప్రమోషన్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా నంబర్ల గురించి కాకుండా ప్రేక్షకుల ప్రేమ సంపాదించడమే నాకు ముఖ్యం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మా నాన్న విక్రమ్ స్టార్ అయ్యారు. నేను కూడా ఆయనలాగే కష్టపడి తెలుగు వారి అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను" అని ధ్రువ్ అన్నారు. తనకు తెలుగులో డైలాగ్స్ రాసిచ్చింది 'హాయ్ నాన్న' డైరెక్టర్, తన స్నేహితుడు శౌర్య అని ఆయన తెలిపారు. కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పనిచేయాలన్న తన కల ఈ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. "మారి సెల్వరాజ్ మొదటి సినిమా చూసినప్పటి నుంచే ఆయనతో పనిచేయాలని ఉండేది. ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ధ్రువ్ డెడికేషన్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. తమిళంలో వచ్చిన అద్భుతమైన స్పందన తెలుగులో కూడా వస్తుందని నమ్ముతున్నాను" అని ఆమె అన్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ పతాకాలపై పా. రంజిత్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అర్జున అవార్డు గ్రహీత, కబడ్డీ క్రీడాకారుడు మణతి గణేశన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. క్రీడా స్ఫూర్తితో పాటు సామాజిక అంశాలను స్పృశిస్తూ రూపొందిన ఈ చిత్రం ఈ నెల‌ 24న జగదంబే ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :