Sunday, 25 January 2026 04:45:24 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు?

Date : 22 May 2025 12:12 PM Views : 361

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్‌గా మారిన టాస్మాక్ లిక్కర్ కుంభకోణంలో యంగ్ హీరోయిన్ కయాదు లోహర్‌కు సంబంధాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో కయాదు లోహర్ కూడా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో తమిళ సినీ ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టాస్మాక్ కుంభకోణంలో భాగస్వాములైన వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైనందుకు కయాదు లోహర్‌కు సుమారు 35 లక్షల రూపాయలు ముట్టాయని తెలుస్తోంది. ఈ ఆరోపణలు నిజమైతే, ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘డ్రాగన్’ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కయాదు, ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధర్వ, జీవీ ప్రకాష్ చిత్రాలతో పాటు, శింబు సరసన ఒక సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుందని సమాచారం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే, గత నాలుగేళ్లలో చేసిన సినిమాల సంఖ్యను అధిగమించేంత బిజీగా మారిన సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం. ఈ వార్తలపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఇది చాలా షాకింగ్‌గా ఉంది. తమిళ పరిశ్రమ కూడా నెమ్మదిగా అవినీతిమయం అవుతోంది" అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై కయాదు లోహర్ వైపు నుంచి గానీ, అధికారిక వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. ఈ వార్తల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :