Monday, 19 January 2026 08:32:30 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Kishkindhapuri | మరిన్ని భాషల్లో బెల్లంకొండ, అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపురి

Kishkindhapuri | కిష్కింధ‌పురి ప్ర‌స్తుతం వ‌న్ ఆఫ్ ది లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.

Date : 22 October 2025 07:17 PM Views : 273

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kishkindhapuri | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన చిత్రం కిష్కింధపురి (Kishkindhapuri). కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి దర్శకత్వంలో ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 12న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా కిష్కింధపురి మ‌రోవైపు డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకునేందుకు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే. కిష్కింధ‌పురి ప్ర‌స్తుతం వ‌న్ ఆఫ్ ది లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. కిష్కింధపురి ఇక తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కిష్కింధ పురి చిత్రాన్ని అక్టోబర్ 24 నుంచి ఆయా భాషల్లో చూసేయొచ్చు. మరిన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకేంటి మీకు ఏ భాషలో చూడాలనిపిస్తే ఆ భాషలో చూసేయండి మరి. అయితే హిందీ వెర్షన్‌కు సంబంధించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కిష్కింధపురిలో సాండీ మాస్ట‌ర్, హైప‌ర్ ఆది, ప్రేమ‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి ఇత‌ర న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :