Thursday, 12 March 2026 01:02:45 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు

Date : 09 February 2026 07:04 PM Views : 33

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : స్వయం సహాయక సంఘాల కోసం 'స్వయం' పేరుతో ప్రత్యేక బ్రాండ్ రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రూ.300 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలని సూచన రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. ఐదో బ్లాకులో జరిగిన ఈ సమావేశంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, గ్రీన్ కవర్ వంటి పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ జోడిస్తేనే మెరుగైన మార్కెట్ సాధ్యమవుతుందని, ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల కోసం 'స్వయం' అనే పేరుతో ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బ్రాండ్ ద్వారా వారి ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. అరకు కాఫీ తరహాలోనే కోకో పంటకు కూడా మంచి బ్రాండ్ తీసుకురావాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని ఆదేశించారు. నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, దీనికి అవసరమైన నిధులను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) సమకూరుస్తుందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో పేరుకుపోయిన చెత్తను (లెగసీ వేస్ట్) వేగంగా తొలగించాలని స్పష్టం చేశారు. 50శాతం పచ్చదనమే లక్ష్యం రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఉగాది నుంచి పాఠశాలల్లో దేశీయ వృక్ష జాతుల పెంపకంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. తీరప్రాంత కోత నివారణకు ఉపముఖ్యమంత్రి చేపట్టిన ప్రాజెక్టును అభినందించిన సీఎం, కోతను అరికట్టడంతో పాటు రైతులకు ఆదాయం అందించేలా ఆర్కిడ్స్ సాగును ప్రోత్సహించాలని సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :