Studio18 News - ANDHRA PRADESH / : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్ కు రూపకల్పన చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రాబోయే పాతికేళ్ల ఆదాయాన్ని తగ్గించిందని చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024–25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. బడ్జెట్ లో కేటాయింపులు ఇలా.. ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు జల వనరులు రూ.16,705 కోట్లు పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి రూ.11,490 కోట్లు రోడ్లు, భవనాలు రూ.9,554 కోట్లు పోలీసు శాఖ రూ.8,495 కోట్లు ఇంధన రంగం రూ.8,207 కోట్లు గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు ఉన్నత విద్య రూ.2,326 కోట్లు యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.322 కోట్లు
Also Read : సాయిపల్లవి చేసిందీ అంటే అది హిట్టేనట!
Admin
Studio18 News