Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రేపు (మార్చి 15) అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలంటూ టీటీడీ పెద్దలు కూటమి ప్రభుత్వ నేతలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్యచౌదరి నేడు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. సీఆర్డీయే పరిధిలోని వెంకటపాలెంలోనిశ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. లోకేశ్ కు ఆహ్వాన పత్రిక, శ్రీవారి ప్రసాదం అందజేశారు. ఈ విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Admin
Studio18 News