Monday, 15 December 2025 12:28:56 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

YSRCP: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ .. మరో 9 మంది కార్పొరేటర్‌లు టీడీపీలో చేరికకు రంగం సిద్దం

విశాఖ నుంచి అమరావతికి చేరుకున్న 9 మంది వైసీపీ కార్పొరేటర్లు జీవీఎంసీలో 61కి చేరనున్న కూటమి బలం రేపు వైసీపీ మేయర్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు! అవిశ్వాస

Date : 18 March 2025 04:02 PM Views : 276

Studio18 News - ANDHRA PRADESH / : విశాఖ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి గెలుపొందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు ఆ పార్టీని వీడి కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమి చెంతకు చేరగా, మరో 9 మంది కార్పొరేటర్‌లు నేడు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. చల్లా రజని, గేదెల లావణ్య, సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణితో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఈరోజు అమరావతికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 29 మంది మాత్రమే కార్పొరేటర్లుగా గెలవగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 11 మంది నేరుగా టీడీపీలో చేరారు. జనసేన పార్టీకి ముగ్గురు కార్పొరేటర్లు ఉండగా, వైసీపీ, స్వతంత్రులుగా గెలిచిన ఏడుగురు జనసేన పార్టీలో చేరారు. బీజేపీ నుంచి ఒక కార్పొరేటర్ గెలవగా, ఇటీవల వైసీపీ నుంచి మరొకరు ఆ పార్టీలో చేరారు. దీంతో కూటమి బలం 52కి చేరింది. ఈ రోజు మరో 9 మంది టీడీపీలోకి రానుండటంతో కూటమి బలం 61కి చేరుతుంది. మొత్తం 98 కార్పొరేటర్ స్థానాలు ఉన్న విశాఖ నగరంలో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్‌‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన దాని కంటే ఎక్కువమంది కార్పొరేటర్లు కూటమిలోకి చేరనుండడంతో రేపు (19వ తేదీ) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి బలం వివరాలతో జీవీఎంసీ ఇన్ చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్‌ను కలిసి లేఖ సమర్పించనున్నారు. ఇప్పటికే వైసీపీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి కార్పొరేటర్ల నుంచి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు సంతకాల సేకరణ పూర్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :