Saturday, 07 March 2026 08:28:25 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం.. గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగారు: నారా లోకేశ్

వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదన్న లోకేశ్ ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపాటు ఇలా అయితే రాష్ట్రానిక

Date : 21 November 2024 01:18 PM Views : 441

Studio18 News - ANDHRA PRADESH / : ఐదేళ్లలో ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 150 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి పెట్టామని... భూములు కేటాయించి పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీని తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా ఆగిపోయిందని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క కాంక్లేవ్ కూడా జరగలేదని... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేశ్ విమర్శించారు. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగిందని... అలాంటి రేస్ ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు... అప్పటి మంత్రి కోడి.. గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోజు నుంచి ఐటీ మంత్రి ఇలా ఉంటారా? అని ఏపీకి అవమానం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను పలు కంపెనీలను కలిశానని... గత ప్రభుత్వంలో వాటాలు అడిగారని వారు చెప్పారని లోకేశ్ తెలిపారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము ఐటీ కంపెనీలతో సమావేశమయ్యామని... వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. చంద్రబాబు చొరవ కారణంగా ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు కనిపిస్తున్నారని... ఇది మనకు గర్వకారణమని అన్నారు.

Also Read : ఉరేసుకున్న మహిళను సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :