Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య ఇవాళ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోర్టు చైతన్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. మంగళగిరి కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. చైతన్య లొంగిపోయిన నేపథ్యంలో, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు దర్యాప్తు వేగవంతం కానుంది. ఇప్పటికే ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ వంటి వైసీపీ నేతలను పోలీసులు ప్రశ్నిస్తున్నప్పటికీ, వారి నుంచి సరైన సమాచారం రావడంలేదని తెలుస్తోంది. ఇప్పుడు చైతన్యను ప్రశ్నించనున్న పోలీసులు, అతడి నుంచి సేకరించే సమాచారం ఆధారంగా, మిగతా నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అవకాశం ఏర్పడింది.
Admin
Studio18 News