Saturday, 14 December 2024 03:01:37 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Kukkala Vidyasagar: ముంబై నటి జెత్వానీ వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్

Date : 20 September 2024 05:22 PM Views : 24

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ముంబై నటి కాదంబరీ జెత్వానీకి గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందుల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. నటి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ (శుక్రవారం) వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. వేరే రాష్ట్రంలో ఉన్న అతడిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాదంబరి జెత్వానీ కేసు పెట్టిన తర్వాత కుక్కల విద్యాసాగర్ పోలీసుల చిక్కకుండా తప్పించుకున్నారు. తన స్నేహితుడి మొబైల్ ఫోన్‌ను వాడారు. అయితే సాంకేతికతను ఉపయోగించి అతడి జాడను పోలీసులు గుర్తించారు. అతడు ఉన్నచోటుకే వెళ్లి అరెస్ట్ చేశారు. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి కాదంబరి జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఆమెను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. దీంతో ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జెత్వానీ ఈ మధ్యే ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఐపీఎస్‌ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. తప్పుడు ఆధారాలు సృష్టించడం, డాక్యుమెంట్ల ఫోర్జరీ, తప్పుడు రికార్డులను రూపొందించడంతో పాటుగా పలు ఆరోపణల వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. వీరితో పాటు మరికొందరి పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు